విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వంలో పెను మార్పులు. ప్రభుత్వ వీప్.
By
Rathnakar Darshanala
విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వంలో పెను మార్పులు. ప్రభుత్వ వీప్.
నేటి వార్త వేములవాడ నియోజవర్గం ప్రతినిధి మల్లేశం గౌడ్
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో పలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న ప్రభుత్వ విప్.
పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంరాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*
మేడిపల్లి మోడల్ స్కూల్ లో కిచెన్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విప్.
విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వంలో పెను మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పేర్కొన్నారు..మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,
మేడిపల్లి మండలంలో పర్యటించారు.మేడిపల్లి మండలం పొరుమల్ల,కట్లకుంట,వల్లంపల్లి, మాచపూర్ గ్రామాల్లో 60 లక్షలతో నూతన అంగన్వాడి భవనాలకు శంకుస్థాపన,మాచపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు..
మేడిపల్లి మోడల్ స్కూల్ లో 10 లక్షలతో నిర్మిస్తున్న కిచన్ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..అనంతరం ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు..
వారు మాట్లాడుతూ మేడిపల్లి మండలానికి అనేక అంగన్వాడి భవనాలను భవనలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
. ప్రజా ప్రభుత్వంలో పేద వారికి ఉన్నత విద్యా అందించడానికి చిన్నాతనంలోనే చిన్నారులకు పౌష్టిక ఆహారం అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు..
గురుకులంలో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య, ఆహారం ఆందజేస్తున్నట్లు అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యార్థులకు ఒకే రకమైన మెనూ ప్రకారం భోజనం అందజేయడం జరుగుతుందని తెలిపారు..
ప్రజా ప్రభుత్వంలో కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు..
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారని తద్వారా ఈ పథకం వలన ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్య విధానంలో పెను మార్పులు చేస్తున్నారని, ఐటిఐ లను ఏటీసి లు మార్పు చేస్తున్నారని200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటిని ఎర్పాటు చేసినట్లు తెలిపారు..
ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో పదకొండు సంవత్సరాలు త్వరాత డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు...మేడిపల్లి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయోధ్య పోరుమల్ల గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి మీ బిడ్డ గెలిచిన తర్వాత రోడ్డు మంజూరు చేయడం జరిగిందని రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న అని తెలిపారు..
*మోడల్ స్కూల్ సందర్శన*
మేడిపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ సందర్శించారు.. 10 లక్షలతో నిర్మిస్తున్న కిచన్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అనంతరం విద్యార్థిని విద్యార్థుల కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వారితో కలసి భోజనం చేశారు..
విద్యార్థి జీవితం ఎంతో ఉన్నతమైనదని ఈ రోజులు మళ్లీ జీవితంలో రావని తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు..
Comments