Hyd :దేవేందర్ నగర్ ఫేజ్ 2 అధ్యక్షుడిగా చిన్నం గణేష్.
By
Rathnakar Darshanala
దేవేందర్ నగర్ ఫేజ్ 2 అధ్యక్షుడిగా చిన్నం గణేష్
కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తా.
నేటి వార్త: జులై 20 ఆదివారం మేడిపల్లి:
బోడుప్పల్ కార్పొరేషన్ 13 వ డివిజన్ దేవేందర్ నగర్ ఫేజ్ 2 కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చిన్నం గణేష్ విజయం సాధించాడు.
అదివారం కాలనీ అసోసియేషన్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహించారు.
అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటి పడగా చిన్నం గణేష్ కు 220 ఓట్లు రాగ సమీప ప్రత్యర్థి భగవంతం కు ఓట్లు 36 పోలాయ్యాయి,చెల్లని ఓట్లు పోలినట్లు తెలిపారు.
ఈ మేరకు ఎన్నికల అధికారులు బైరుగొండ మల్లేష్, సీసాల సత్తయ్య,చల్లా నరసింహలు,రవి,సుధాకర్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
అనంతరం చిన్నం గణేష్ విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కాలనీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి దోహద పడిన కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,
మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పోగుల నరసింహ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ 13 వ డివిజన్ ఇంచార్జ్ జెన్న రాజు లకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
Comments