ADB :గంజాయి విక్రయ దారు అరెస్టు - రూరల్ సీఐ కె ఫణిదర్.

Rathnakar Darshanala
గంజాయి విక్రయ దారు అరెస్టు - రూరల్ సీఐ కె ఫణిదర్.
 *గంజాయి సేవించిన, వర్తకం చేసిన, కలిగి ఉన్న, రవాణా చేసిన, పండించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు.*

 *ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, నిందితుని అరెస్ట్.*

 *నిందితుని వద్దనుండి గంజాయి మరియు ఒక సెల్ఫోన్ స్వాధీనం.* 

నేటి వార్త ఆదిలాబాద్ :
 *నిందితుని వివరాలు.*

మీసాల అజయ్ (24) s/o చంద్రశేఖర్, హమాలివాడ ఇంద్రానగర్ ఆదిలాబాద్. 

ఆదిలాబాద్ రూరల్ సీఐ కే ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ హమాలివాడ చెందిన నిందితుడు మీసాల శేఖర్ గత కొద్ది కాలంగా డబ్బులపై అత్యాశతో,

మహారాష్ట్ర నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ప్రజలకు బానిసగా చేస్తూ అమ్ముతున్నట్లుగా సమాచారం మేరకు అతనిని పట్టుకోగా అతని వద్ద ఒక గంజాయి ప్యాకెట్ లభించిందని అతనిని  అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. 

ఇతనిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, విచరించగా ఇతనికి గత కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన నాందేడ్ విజ్జు అనే వ్యక్తి నుండి 400 గ్రాముల గంజాయిని 5000 రూపాయలకు కొనుగోలు చేసినట్టు దానితో ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఇతని వద్ద ఈరోజు ఐదు గ్రాముల కు చెందిన ఒక ప్యాకెట్ లభించిందని తెలిపారు. ఇతని గౌరవ న్యాయమూర్తి ముందు హాజరు పరిచయం జరిగిందని తెలిపారు. 

ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments