రైలు ఢీకొని యువకున్ని మృతి.

Rathnakar Darshanala
రైలు ఢీకొని యువకున్ని మృతి.
నేటి వార్త జూలై 26 కాగజ్ నగర్:

 రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం కాగజ్నగర్ లో జరిగింది. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో స్థానిక సంజీవయ్య కాలనీకి చెందిన ఇగురపు శ్రీనివాస్ (40) అక్కడికక్కడే మృతి చెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ విలేకరులకు తెలిపారు. 

మృతుడు ఉదయం తన కాలనీకి సమీపంలోని రైల్వే పట్టాల వైపు వెళ్ళగా గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

మృతుడు స్థానిక సంజీవ కాలనీ లో టైలరింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రైల్వే పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments