గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.

Rathnakar Darshanala
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
జిపిఎస్ అధ్యక్షుడు రాజు నాయక్.

నంద్యాల ప్రతినిధి నేటి వార్తలు జూలై 28 :

ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ని కలిసి వినతి పత్రం అందజేసిన గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, 

రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, కటారి కృష్ణ కమిటీ సభ్యులు ఉన్నారు.గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య, విద్య సదుపాయాలు కల్పించి మౌలిక వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ కోరారు.

సోమవారం నంద్యాల పట్టణంలోని జిల్లా బిజెపి కార్యాలయంలో నంద్యాల పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో రాజు నాయక్ మాట్లాడుతూ
కర్నూలు ఉమ్మడి జిల్లాలో దాదాపు 42 చెంచు గుడాలు, 82 తండాలు, వందకు పైగా ఏరుకుల కాలనీలు ఉన్నాయి. 

లక్షల మంది గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కుడు గూడు నీడ లేక జీవిస్తున్నారనీ  అయితే కొన్ని గిరిజన ప్రాంతాల్లో చెంచుగూడాల్లో రోడ్డు సౌకర్యం, 

మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. చెంచుగూడలో త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు.

 కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి పాలవుతున్నారూ సరైన మౌలిక సౌకర్యం లేక విద్యుత్ సౌకర్యం లేక, బస్సు సౌకర్యం లేక కాలినడకన ప్రయాణం చేయాల్సిన దుస్థితి గిరిజన చెంచుగూడాల్లో నెలకొందన్నారు, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్, స్కీములు

కేంద్రం ప్రభుత్వ పథకాలు 
నోచుకోలేకపోతున్నామన్నారు. 

చాలామందికి కేంద్ర పథకాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలియడం లేదన్నారు ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు గిరిజన ప్రాంతాల్లో కెళ్ళి అవగాహన సదస్సు పెట్టి ప్రభుత్వ పథకాల గురించి వివరించాలన్నారు.  

చెంచు గిరిజనులకు ప్రతిగూడలో, ఆశ్రమ పాఠశాల, గురుకుల రెసిడెన్షియల్ లో ఆర్ వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి  ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు అంతేకాకుండా ప్రతి చెంచు గిరిజన తండాలో సోలార్ సిస్టం ప్లాంటును ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.

 ఎస్టి జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే, ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో, కేబినెట్లో తిరస్కరించేందుకు కృషి చేయాలన్నారు. మాధవ్ సానుకూలంగా స్పందించి ఈ విషయంపై కేంద్రానికి పంపించి గిరిజనులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
Comments