అంగన్వాడి విద్యార్థులకు ప్రోటీన్ పౌష్టిక చాకోమాల్ట్ అందజేత.
By
Rathnakar Darshanala
అంగన్వాడి విద్యార్థులకు ప్రోటీన్ పౌష్టిక చాకోమాల్ట్ అందజేత.
నేటి వార్త
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని అంగనవాడి విద్యార్థులకు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎలుక కృష్ణ విద్యార్థుల ఎదుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్ పౌష్టిక చాకోమాల్ట్ ను సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. చిన్నారులు పౌష్టిక ఆహారం తిని ఆరోగ్యంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండలి తులసీదాస్, మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలు విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Comments