ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి.

Rathnakar Darshanala
ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జూనియర్  కళాశాలను సీజ్ చేయాలి.
 యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి  విద్యార్థులకు న్యాయం చేయాలి


నంద్యాల ప్రతినిధి నేటి వార్త జులై 28: నంద్యాల పట్టణం శివారులో బండి ఆత్మకూరు వెళ్ళు మార్గంలో  ఉన్న ప్రభాత్ జూనియర్ కళాశాల ఎటువంటి అనుమతులు లేకుండా,

 షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా మరియు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేకుండా ఒకే క్యాంపస్ లో రెండు కళాశాలలు మరియు డిఫెన్స్ అకాడమీ మరియు హాస్టల్ కు పర్మిషన్ లేకున్నా ,

యాజమాన్యం నిర్వహిస్తున్నారని విద్యార్థుల వద్ద నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు  వసూలు చేస్తూ నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారని నంద్యాల జిల్లా ఐ ఈ ఓ శంకర్ నాయక్ గారికి వినతి పత్రం అందజేసిన రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు, 

రాష్ట్ర కార్యదర్శి పూల వెంకట్, టిఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల జయరాజు, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగ సారి సుంకన్న ఈ  సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న  ప్రభాత్ జూనియర్ కళాశాలను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments