మెగా జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఆత్రం సుగుణక్క.

Rathnakar Darshanala
మెగా జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి:ఆత్రం సుగుణక్క
(నేటి వార్త)నార్నూర్ 

ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఈ నెల 25న నిర్వహించే మెగా జాబ్‌ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఆత్రమనసుగుణక్క పిలుపునిచ్చారు.

బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌ మేళాకు యువత తరలి రావాలని కోరారు.

పెర్కగూడ జే.సి.ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ జాబ్‌ మేళా లో 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు.

సుమారు వేయ్యికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఐటీఐ, ఫార్మసీ డిప్లొమా కోర్సులు చదివిన యువతీ యువకులకు అవకాశాలున్నాయని చెప్పారు.

ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం అందరికీ రావడం కష్టమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.

ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే జాబ్‌ మేళా వివరాల కోసం 8143402805,9492519669 సెల్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఈ సమావేశంలో ఎస్టి సెల్ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్,రాజవ్వ, అవినాష్,భూచ్చన్న నవీన్, తదితరులు పాల్గొన్నారు
Comments