మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.ఉదయం ఫౌండేషన్.
By
Rathnakar Darshanala
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.
: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఉదయం ఫౌండేషన్ ఆర్థిక సహాయం.
నేటివార్త రాయికల్,జూలై 23:
రాయికల్ మండలంలోని అయోధ్య గ్రామానికి చెందిన తునికి జల (42) గత కొన్ని నెలలుగా షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ టాబ్లెట్లు వాడుతోంది.
ఆరు సంవత్సరాల క్రితం భర్త రాజేశం మరణించగా, ఆమె బీడీలు చుడుతూ జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవల మంచం పట్టిన ఆమెకు ఆసుపత్రికి వెళ్లాలన్న ఆర్థిక పరిస్థితి లేక అంధకారంలో నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఫౌండేషన్ ప్రతినిధులు తక్షణమే స్పందించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నిలిచారు.
ఈ కార్యక్రమంలో పంచతి నరేష్, బాలరాజు, రాజేందర్, రాజశేఖర్, మహమ్మద్ అస్లాం, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments