ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.

Rathnakar Darshanala
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.
*--గణితశాస్త్రంలో మెలుకువలు నేర్చుకొని పట్టు సాధించాలి*

*--మన ఊరు మనబడి కింద నిర్మాణం కి నోచుకుని సిద్ధంగా ఉన్న డైనింగ్ హాల్ ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి*

*--వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

*నేటివార్త జులై 23 (వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*

పెబ్బేరు మండల పరిధిలోని అయ్యవారిపల్లె గ్రామంలో  జిల్లా పరిషత్ హైస్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. 

ఈ ఏడాదికి వచ్చే ఏడాదికి విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరగాలే కానీ తగ్గకూడదని సూచించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఏఐ  ద్వారా కంప్యూటర్ ఆధారిత విద్యార్థులకు చదువు నేర్పించడం కోసం ఏర్పాటు చేసిన తరగతి గదిని సందర్శించారు. 

విద్యార్థులు ఏఐ ద్వారా చదువు నేర్చుకుంటున్న విధానాన్ని పరిశీలించారు.  విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు ఇచ్చి తరగతులు నిర్వహించాలన్నారు.  
ఇంటర్నెట్, కంప్యూటర్లు సరిపడినాన్ని ఏర్పాటు చేసి ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పలు ప్రశ్నలు సంధించి వారిలో గణిత సామర్థ్యాలను తెలుసుకున్నారు. 

గణితశాస్త్రంలో మెలుకువలు నేర్చుకొని పట్టు సాధించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. అనంతరం పలు గణిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థులకు నోటు పుస్తకాలను బహూకరించారు. 

పాఠశాల ప్రాంగణంలో మన ఊరు మనబడి కింద నిర్మాణం కి నోచుకుని సిద్ధంగా ఉన్న డైనింగ్ హాల్ ను వెంటనే ఓపెన్ చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఎంఈఓ, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.

 ఈ కార్యక్రమంలో పెబ్బేర్ తహసిల్దార్ మురళి గౌడ్, ఎంఈఓ జయరాములు, మహానంది,  ఉపాధ్యాయులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments