వివి రావుపేట్ హైస్కూల్లో చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం.

Rathnakar Darshanala
వివి రావుపేట్ హైస్కూల్లో చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం.
• సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి - ఎం ఎల్ హెచ్ పి-శైలజ. 

మల్లాపూర్ జులై24 (నేటి వార్త దిన పత్రిక):

మల్లాపూర్ మండలం వివి రావుపేట్ హైస్కూల్లో గురువారం రోజున విద్యార్థులకు చేతుల శుభ్రపరచుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థిని విద్యార్థులకు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చేతుల హ్యండ్ వాష్.పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఎల్ హెచ్ పి శైలజ. ఏఎన్ఎం కోమల మాట్లాడుతూ చేతుల మీద ఉండే క్రీములు బ్యాక్టీరియా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి వివిధ రకాల వ్యాధులను కలిగిస్తాయని కాబట్టి 

చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు.

 చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 20 సెకండ్లు పాటు శుభ్రంగా కడుక్కోవాలన్నారు చేతుల.పరిసరల పరిశుభ్రత.ఆరోగ్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

సీజనల్ వ్యాధుల పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి జలపతి రెడ్డి,ఉపాధ్యాయ బృందం రాజశేఖర్,వెంకటరమణ,ఉమారాణి,ఆశ కార్యకర్త జమున రాణి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Comments