తెలంగాణ రాష్ట్ర నీళ్లను ఆంధ్ర కు దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి.
By
Rathnakar Darshanala
తెలంగాణ రాష్ట్ర నీళ్లను ఆంధ్ర కు దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి.
- గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదు.
- బిఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్.
నేటివార్త, జూలై 24, బెల్లంపల్లి:
కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాలతో పాటు పలు కళాశాలలో తిరిగి బనకచర్ల ప్రాజెక్ట్ అక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బడికల శ్రావణ్ మాట్లాడుతూ,
చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని.
బనకచర్ల ద్రోహాన్ని బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని అడ్డుకొని తీరుతామని, ఆంధ్ర ప్రభుత్వం ఆక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని మరియు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న వైఖరిని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వివరించడం జరిగింది.
పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టే పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్ట్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుత్తు ఈనాడు తెలంగాణ రాష్ట్ర నీళ్లను ఆంధ్ర కు దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడాలని అన్నారు.
అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం దుర్మార్గం. ఇంత వరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల విద్య భరోసా కార్డు ఇవ్వలేదు.
విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వలేదు. మరియు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని తీవ్రమైన మోసం చేసినటువంటి మోసకారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కోరారు.
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పది పాస్ అయితే 10 వేలు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15 వేలు, డిగ్రీ పాస్ అయితే 25 వేలు , పీజీ పాస్ అయితే లక్ష, ఏం ఫీల్ , పిహెచ్డి పూర్తిచేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండి పడ్డారు.
తక్షణమే గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ బి ఆర్ ఎస్ వి తరుపున విద్యార్థులతో కలిసి రేవంత్ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాము అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు మారం మహేందర్ యాదవ్,ఉప సర్పంచ్ బాపు,మండల అధ్యక్షులు సత్యం,అనిల్, అజయ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు అడెపు అరుణ్, సుమంత్,నరేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments