స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి.

Rathnakar Darshanala
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి.
 *గిర్కటి నిరంజన్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌటుప్పల్*

*నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేంద్ర నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాల ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు *గిర్కటి నిరంజన్ గౌడ్* కార్యకర్తలకు నాయకుల కు పిలుపునిచ్చారు.

 త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఎంపిటిసి సీట్లు మరియు జెడ్పిటిసి కైవసం చేసుకునే విధంగా కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను మరియు ఎన్నికలు ఇచ్చిన దొంగ హామీలను నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య వంతులను చేయాలని పిలుపునిచ్చారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పట్టణాలలో పల్లెల్లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినవని అన్నారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిద్దాం అని అన్నారు.
Comments