నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కాజేసిన అమ్మకం దారుడు.

Rathnakar Darshanala
నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కాజేసిన అమ్మకం దారుడు.
నేటి వార్త జూలై 26 కాగజ్ నగర్: 

భూమి అమ్మకం దారు ల మోసం, అధికారుల అవినీతి వెరసి కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 

అమ్మకం దారుల వద్ద తాను కొనుగోలు చేసిన భూమి తిరిగి వారే మోసపూరితంగా రికార్డులు సృష్టించి తమ పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ప్రముఖ ఫార్మసిస్ట్ వ్యాపారి తూడూరు వేణుగోపాల్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. 
వాస్తవానికి తాను రాస్పల్లి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 385 కి చెందిన యజమాని అలుగవెళ్ళి వెంకట కృష్ణారెడ్డి నుండి  385/ఏ ఏ 2/2 ను డాక్యుమెంట్ నెంబర్ 16 71 (2011) తేదీ 29.04.2011,  5.05 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

అయితే అలుగవేల్ల్లి వెంకటకృష్ణారెడ్డికి గతంలో అమ్మిన పట్టేదారులు ఎ నుముల వెంకయ్య, నిందితులు తాటిపాముల బలరాం, 

తాటిపాముల పద్మ లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తాను కొనుగోలు చేసిన 5.05 ఎకరాల భూమికి నకిలీ ఆధార పత్రాలు సృష్టించి ధరణి రికార్డులను తారుమారు చేసి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు.

 ఇట్టి నిందితులపై జిల్లా కలెక్టర్కు, కాగజ్నగర్ తహసిల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే కాగజ్నగర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు న్యాయ నిమిత్తం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments