గుడుంబా స్థావరాలపై పోలీసుల తనిఖీ.
By
Rathnakar Darshanala
గుడుంబా స్థావరాలపై పోలీసుల తనిఖీ.
నేటి వార్త జూలై 27 కాగజ్ నగర్:
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ ఎస్ఐ, కాగజ్నగర్ రూరల్ సీఐ,
సర్కిల్ ఎస్ఐలతో సంయుక్తంగా గుడుంబా స్థావరాలపై దాడి జరిపి నిందితులను పట్టుకున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఈస్ గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుకోడా గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ మేరకు గ్రామంలోని గుడుంబా స్థావరలపై దాడి జరిపి 800 లీటర్ల గుడుంబా పానకం, రెండు బస్తాల ఇప్ప పువ్వును స్వాధీనం చేసుకుని వాటిని నాశనం చేశారు.
ఇంకా గ్రామంలోని 20 మోటార్ సైకిళ్ళు, రెండు ఆటో రిక్షాలు, ఒక ట్రాక్టర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో జరిగిన సమావేశంలో గుడుంబా, గంజాయి వాడకంపై కలుగు దుష్ప్రభావాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు.
Comments