జిన్నారం జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయ గడప ప్రతిష్ట.
By
Rathnakar Darshanala
జిన్నారం జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయ గడప ప్రతిష్ట.
*నేటి వార్త...
జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం మరియు వినాయక భ్రమరాంబిక అమ్మవార్ల గర్భగుడిలా గడప దాత జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ వేద పండితులతో మంత్రోచ్ఛారణతో గర్భగుడిలో గడపను జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ రాజశ్రీ దంపతులు మరియు ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా స్థాపన చేయడం జరిగింది...
మాజీ ఎంపీపీ మాట్లాడుతూ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం రాబోయే రోజుల్లో అంగరంగ వైభవంగా మహ అద్భుతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుందని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయ నిర్మాణం జరగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు గర్భాలయ గుడికి గడపలు చేపియ్యడం జరిగిందని తెలిపారు
అలాగే రాబోయే రోజుల్లో జీవనజ్యోతి జ్యోతిర్లింగ ఆలయానికి హనుమంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.
గడప ప్రతిష్ట మహోత్సవం మా చేతుల మీదుగా జరగడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
జిన్నారం మండల కేంద్రంలో మంచి పుణ్యక్షేత్రంగా వెలిసి ప్రజల కోరికలు నెరవేరుస్తూ ప్రజలందరిని సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో చల్లగా చూడాలని వేడుకున్నాడు*
*ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలో ఉన్న మహిళలు యువకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూజలో పాల్గొనడం*
Comments