కాగజ్ నగర్ లో శ్రీ సత్య సాయి సహస్ర నామార్చన.
By
Rathnakar Darshanala
కాగజ్ నగర్ లో శ్రీ సత్య సాయి సహస్ర నామార్చన.
నేటి వార్త జూలై 27 కాగజ్ :
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక షిరిడి సాయి మందిరంలో శ్రీ సత్య సాయి బాబా సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్య సాయి సేవ సంస్థల అధ్యక్షుల సూచన మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించగా ఉదయం 10 గంటల నుండి శ్రీ సత్య సాయి సహస్రనామార్చన (1008 సార్లు) నిర్వహించారు.
స్థానిక ఎస్పియం న్యూ కాలనీ లోని సాయి మందిరంలో మూడుసార్లు ఓంకారం, గణపతి ప్రార్థన, మూడుసార్లు సాయి గాయత్రి మంత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ స్వామివారి పాకెట్ సైజ్ ఫోటో, బియ్యం అందించి తండులర్చనలతో సహస్రనామావళి జపించారు. అనంతరం శ్రీ సత్య సాయి యువ విభాగం వారిచే ''ప్రేమ తరుణ్ '' మొక్కలు నాటే కార్యక్రమాన్ని మందిర ఆవరణలో చేపట్టారు.
అనంతరం మహా ప్రసాదం వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ కె. నాగేశ్వరరావు,
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ సుధీర్, విద్యా విభాగం కోఆర్డినేటర్ శ్రీమతి కె. భార్గవి, యువ విభాగం కోఆర్డినేటర్ కె. సతీష్ లతోపాటుగా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Comments