చేయూత పెన్షన్ పెంచాలని డిమాండ్.

Rathnakar Darshanala
చేయూత పెన్షన్ పెంచాలని డిమాండ్.
 – జగిత్యాలలో మహాగర్జన సన్నాహక సభకు సన్నాహాలు.

నేటివార్త రాయికల్,జూలై 24 :
ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చే చేయూత పెన్షన్‌ను పెంచాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా రాయికల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ధోబ్బల వేణు గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు.

సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు దుమల గంగారం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ మాట్లాడుతూ, 

“తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వికలాంగులకు రూ. 6,000, చేయూత పెన్షన్‌దారులకు రూ. 4,000 పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. 

అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనప్పటికీ ఈ హామీ అమలు కాకపోవడం నిరాశాజనకమని” ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాళ్ల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా,ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే పెంచుకుంటూ పెన్షన్‌దారులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.

 “లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ పెన్షన్లు పెంచుతుంటే, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు పెంచడం లేదు?” అని ప్రశ్నించారు.

ఆగస్టు 1న జగిత్యాలలో జరుగనున్న "మహా గర్జన సన్నాహక సదస్సు"లో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  పాల్గొననున్న నేపథ్యంలో, మండల ప్రజలంతా భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎమ్మెస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బోనగరి కిషన్, వికలాంగుల నాయకులు సామల్లా ప్రసాద్, కండ్లపెల్లి రాజారాం, బాపురపు నర్సయ్య, పాలేపు బాలరాజు, పడిగేల నరసింహ,నల్ల నరేందర్, కండ్లపెల్లి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments