అపర్ణ సైబర్ జోన్ ప్రాంతాల్లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పర్యటన.
By
Rathnakar Darshanala
అపర్ణ సైబర్ జోన్ ప్రాంతాల్లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పర్యటన.
నేటి వార్త, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో గల అపర్ణ సైబర్ జోన్ ప్రాంతాల్లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గురువారం పర్యటించారు.
గేటెడ్ కమ్యూనిటీ వాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ వాసులు తో సమావేశమై అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకునీ నెలకొన్న సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కమ్యూనిటీలో చిత్త సేకరణ పనులు నిబంధనల ప్రకారం ప్రతి రోజు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పారిశుధ్య పనులు క్రమబద్ధంగా కొనసాగేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్ని తెలిపారు.సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ శ్రీరీష, ఏఎంఓ హెచ్ శ్రీకాంత్ రెడ్డి,ఎ ఈ రషీద్,అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ లలిత్ చౌదరి,రాజీవ్ సింగ్ , సిద్ధార్థ్ రెడ్డి,జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది, సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, శేఖర్, సుమన్, తిరుపతి, రాజు, గోవింద్, చందు, ప్రకాశ్ వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments