రాయికల్ లో గుండెపోటుతో సీస కమ్మరి వృత్తిదారుడి మృతి.
By
Rathnakar Darshanala
రాయికల్ లో గుండెపోటుతో సీస కమ్మరి వృత్తిదారుడి మృతి.
— దహన సంస్కారాలకు సాయం కోరుతున్న కుటుంబం.
నేటివార్త రాయికల్,జూలై 27: రాయికల్ పట్టణంలోని కోరుట్ల క్రాసింగ్ రోడ్డులో గత పది సంవత్సరాలుగా సీస కమ్మరి వృత్తితో జీవనం సాగిస్తున్న నరాల జాంగిర్ (వయస్సు సుమారు 50) ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందారు.
అతని స్వస్థలం జగిత్యాల జిల్లా మైతాపూర్ కాగా, కుటుంబంతో కలిసి గత దశాబ్దకాలంగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
జాంగిర్ కుటుంబం పూర్తిగా తన ఆదాయంపై ఆధారపడినది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబానికి, ఇది తీవ్రమైన ఆర్థిక దెబ్బగా మారింది. సంవత్సరమున్నర క్రితం ఆ కుటుంబంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
వారి కుమారుడు నాగేష్ బావిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు అయిన జాంగిర్ మృతితో కుటుంబం పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.
ప్రస్తుతం దహన సంస్కారాలకు అవసరమైన ఖర్చులు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్న జాంగిర్ భార్య అనసూర్య (వయస్సు 45), పెద్ద కుమార్తె నాగమణి (18), చిన్న కుమార్తె నాగేశ్వరి (15) మానవత్వంతో ముందుకు వచ్చి సాయంచేయాలని పౌరులకు,
దాతలకు కన్నీటి మిన్నగా వేడుకుంటున్నారు.
సహాయం అందించదలచిన వారు స్థానికంగా కుటుంబాన్ని సంప్రదించవచ్చు.
Comments