లక్ష్యంతో చదివితే విజయం సొంతం అవుతుంది.

Rathnakar Darshanala
లక్ష్యంతో చదివితే విజయం సొంతం అవుతుంది.
-ఐక్యంగా ఉంటే అన్ని రంగాలలో గెలుపు సాధిస్తారు..
-పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయ రమణారావు..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 27 ఆడిచర్ల రమేష్

పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి పదవ తరగతి 

విద్యార్థిని విద్యార్థులకు పురస్కార కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 550 మార్కులు పొందిన 35 మంది విద్యార్థులను కమిటీ సభ్యులతో కలిసి సత్కారించి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణారావు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.తదుపరి ఎమ్మెల్యే కు పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ,జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు ఐక్యంగా ఉండి తమ కుల బాంధవుల విద్యార్థులను ప్రోత్సహించాలని లక్ష్యంతో అండగా నిలిచి వారిని ఘనంగా సన్మానిస్తూ నగదు పురస్కారం అందించడం అభినందనీయమన్నారు.

జిల్లాలో ఉన్న పద్మశాలిలందరూ ఐక్యంగా ఉండేవిధంగా తోడ్పడుతానని రానున్న రోజుల్లో రెండు సంఘాలను ఏకం చేసి ఏకతాటిపైకి తీసుకువచ్చేలా కృషి చేస్తానన్నారు.

పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేలా సహకరించాలని జిల్లా కమిటీ కోరగా కుల బలంతో పాటు ప్రజాసేవ చేసే తత్వం ఉండాలని ఇతర కులాలను కలుపుకు పోతూ ఐక్యంగా ఉంటే విజయం తద్య మవుతుందని ప్రతి ఒక్క వ్యక్తి సేవ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. 

అనంతరం జిల్లా పద్మశాలి సంఘానికి స్థలం కేటాయించాలని కమిటీ సభ్యులు కోరగా త్వరలో జిల్లా సంఘంకు స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య,హడా కమిటీ కన్వీనర్ వలస నీలయ్య, తెలంగాణ ప్రాంత పద్మశాలి రాజకీయ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వాసాల రమేష్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఆడెపు సుధాకర్,

గుండేటి రాజేష్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కార్యదర్శి బూర్ల లక్ష్మీనారాయణ,తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు కోమటిపల్లి సదానందం,పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెగడ చందు,

పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు బత్తుల రమేష్, మండల అధ్యక్షులు,సబ్బని రాయమల్లు లతోపాటు జిల్లాలోని అన్ని మండల అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు కుల బాంధవులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments