త్రాగునీటి ఎద్దడి తీర్చిన మంత్రి వివేక్.
By
Rathnakar Darshanala
త్రాగునీటి ఎద్దడి తీర్చిన మంత్రి వివేక్.
*హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు*
నేటివార్త చెన్నూరు జూలై 24 :
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బాబురావు పేట గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ సమస్యపై స్థానిక గ్రామస్తులు మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి సీఎస్ఆర్ నిధులతో నూతన బోర్ వేయించారు.
త్రాగునీటి సమస్యను తీర్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హిమంత్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments