పెద్దపల్లి ఏసిపి కృష్ణను పరామర్శించిన..మంత్రి వివేక్.

Rathnakar Darshanala
పెద్దపల్లి ఏసిపి కృష్ణను పరామర్శించిన..మంత్రి వివేక్.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 23 ఆడిచర్ల రమేష్.

పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తండ్రి ఇటీవల పరమపదించగా వారి నివాసానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర కార్మిక,ఉపాధి,పరిశ్రమలు, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి కృష్ణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు.

ఈ సందర్భంగా మంత్రి  స్వర్గీయుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి తీరని లోటు కలిగిన ఈ విషాద సమయంలో ప్రభుత్వం,పార్టీ తరఫున తమ సంపూర్ణ సానుభూతి వ్యక్తం చేశారు.
Comments