రాయి సెంటర్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక కృషి..మాజీ ఎంపీ సోయం బాపురావు.
By
Rathnakar Darshanala
రాయి సెంటర్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక కృషి..మాజీ ఎంపీ సోయం బాపురావు.
నేటి వార్త జైనూర్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల జీవన విధానం..సంస్కృతి సంప్రదాయ లో భాగమైన న్యాయ స్థానాలుగా గా కీలక పాత్ర పోషిస్తున్న రాయిసెంటర్ వ్యవస్థ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తామని *మాజీ ఎంపీ సోయం బాపురావు* అన్నారు.
జైనూర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 27 న ఎస్ టీ యూ భవన్ లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ ముద్దు బిడ్డ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నట్లు ఆయన తెలిపారు.
రాజ్ గోండు సేవా సమితి అధ్యక్షుడు గా టైగర్ కారిడార్ జి. ఓ ను నిలుపుదల కోసం కృషి చేయడం జరిగిందని ఇందుకు ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు,సీతక్క గారు, ఎంఎల్ఏ బొజ్జు పటేల్, CM సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారి సహకారం ఎంతో ఉందని గుర్తు చేశారు.
జి. ఓ పై ఆదివాసీల భయాందోళన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 49 జి ఓ నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వడం హర్షణీయమన్నారు.
రాజ్ గోండు సేవా సమితి ద్వారా ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీ గుడాల అభివృద్ధికి పాటుపడటానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.
ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయ వంతం చేయాలని పిలుపు ఇచ్చారు.అంతకు ముందు మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి *మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ శాలువ కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ముఖీద్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, నాయకులు మెస్రం అంబాజీ, గోపిచంద్, ఆత్రం జలింషా, మెస్రం భూపతి, డైరెక్టర్లు పంద్ర షేకు, మండాడీ లింగు,కనక గంగారం, తుమ్రం కొటేష్, హైదర్, ప్రకాష్, వసీం, రహీమ్, అబ్బు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
Comments