ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.
By
Rathnakar Darshanala
ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.
*అదిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు తీసుకుంటాం*
*జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ హెచ్చరిక*
నేటివార్త చెన్నూరు జూలై 23
ఫెర్టిలైజర్ షాపు డీలర్లు ఎరువులను అదిక ధరలకు రైతులకు అమ్మినట్లైతే డీలర్లపై చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి చత్రునాయక్ డీలర్లను హెచ్చరించారు. జిల్లా
కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని ఎరువుల దుకాణాలను బుదవారం రోజున జిల్లా వ్యవసాయశాఖ అధికారి చత్రునాయక్ మండల వ్యవసాయ అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చత్రు నాయక్ మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి ఎరువుల దుకాణం ముందు స్టాక్ బోర్డు కచ్చితంగా పెట్టాలని,
రైతులకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బానోతు ప్రసాద్, ఎంఏఓ యామిని, పాల్గొన్నారు.
Comments