కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ యాదవ్.
By
Rathnakar Darshanala
కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ యాదవ్.
*-కేటీఆర్ దంపతుల ఫోటో ఫ్రేమ్ అందజేత*
నేటి వార్త, శేరిలింగంపల్లి:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నంది నగర్ లోని ఆయన నివాసంలో కేటీఆర్ 49వ జన్మదిన సందర్బంగా ప్రత్యేకంగా కలిసి విష్ చేశారు.
అలాగే కేటీఆర్ దంపతుల ఫోటో ఫ్రేమ్ ను అందజేశారు. కేటీఆర్, ఆయన భార్య శైలిమతో కూడిన చిత్ర పటాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు.
రవీందర్ యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కేటీఆర్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, విశ్వనగరం గా మార్చారని కొనియాడారు.
పేదల కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో అండగా నిలిచారాని గుర్తు చేశారు. తన జన్మదినం సందర్భంగా ఖర్చులు పెట్టకుండా.. గిఫ్ట్ లు తనకు ఇవ్వొదని, అదే డబ్బులతో పేదలకు సహాయం చేయాలి అని పార్టీ నేతలకు సూచించారని తెలిపారు.
తాను సైతం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారాని చెప్పారు. పార్టీ నేతలు సైతం పేదలకు సహాయం చేస్తూ అండగా నిలవాలని రవీందర్ యాదవ్ సూచించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పేదలకు తమ వంతు సహాయ సహకారం అందించాలని కోరారు. రానుంది భారాస ప్రభుత్వమేనని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
Comments