ఆర్జీయూకేటీ బాసరలో గ్లోబల్ కోటా విద్యార్థులకు కొనసాగుతున్న కౌన్సిలింగ్.

Rathnakar Darshanala
ఆర్జీయూకేటీ బాసరలో గ్లోబల్ కోటా విద్యార్థులకు  కొనసాగుతున్న కౌన్సిలింగ్. 
నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి జులై 24
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర మరియు మహబూబ్‌నగర్ కేంద్రాలలో గ్లోబల్ కోటా కింద  విద్యార్థుల కౌన్సెలింగ్ కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ సందర్భంగా, ఆర్జీయూకేటీ వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖీ మాట్లాడారు. గ్లోబల్ కోటా కింద ప్రవేశ విధానం, నియమ నిబంధనలు, ఫీజు నిర్మాణం, విద్యా విధానం, అందించబోయే కోర్సుల వివరాలు మరియు క్యాంపస్ వసతులపై ఆయన స్పష్టతనిచ్చారు.
Comments