ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు.
By
Rathnakar Darshanala
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు.
నేటివార్త,జూలై 25,తాండూర్:
జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త తనిఖీలలో భాగంగా తాండూర్ మండలంలోని హనుమాన్ ఫెర్టిలైజర్,ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం,కాసిపేట, ఇతర ఫెర్టిలైజర్ దుకాణాలను మండల తహసిల్దార్ జ్యోత్స్న,మాదారం ఎస్ఐ సౌజన్య,మండల వ్యవసాయ అధికారిని సుష్మా తనిఖీ చేశారు.
ఎరువుల దుకాణాలను,గోదాములను తనిఖీ చేసి డీలర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఎవరైనా డీలర్లు ఎరువులను అధిక ధరలకు అమ్మిన అలాగే రైతులకు ఇతర ఎరువులకు లింకు చేసి అమ్మిన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రతి ఎరువు దుకాణం ముందు స్టాకు నిలువలు,ధరల పట్టిక రైతులకు కనబడేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని వానాకాలం సీజన్ కు గాను రైతులకు కావలసినవి అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు.
యూరియాను వ్యవసాయ సాగు కొరకు మాత్రమే అమ్మాలని హెచ్చరించారు. ఇందులో ఎఈఓ వేంకటేశం తదితరులు ఉన్నారు.
Comments