తెలంగాణ లో కష్టాల కొలిమిలో కుమ్మరి.

Rathnakar Darshanala
తెలంగాణ లో కష్టాల కొలిమిలో కుమ్మరి.
• కుండాలెన్ని  చేసినా కూటికే కరువాయే

• ప్రభుత్వం ఆదుకొని తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి.


మల్లాపూర్ జులై 25(నేటి వార్త దిన పత్రిక) మల్లాపూర్ మండలంలోని శుక్రవారం రోజున జాతీయ బంకమట్టి దినోత్సవం సందర్భంగా శాలివాహన మండల నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ మరిపెళ్లి మల్లయ్య,మామిడిపల్లి శేఖర్ మాట్లాడుతూ.

స్టీల్,ప్లాస్టిక్ వస్తువుల రాకతో కులవృత్తులు మరుగున పడిపోయాయని వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన మామిడిపల్లి శేఖర్ వాపోయారు.

గత ప్రభుత్వంలో శాలివాహన సంఘం నాయకులతో 15 మంది చొప్పున సొసైటీ ఏర్పాటు చేసుకోమని చెప్పి డీడీలు కట్టించుకొని పేపర్ కి పరిమిత చేశారు కానీ ప్రభుత్వ నుండి ఏలాంటి సబ్సిడీ రుణాలు గాని పరికరాలు గాని అందలేదు అని తెలియజేశారు.

 ఈ ప్రభుత్వమైనా తమకు తగు న్యాయం చేసి సబ్సిడీ రుణాలు అందేటట్లు చొరవ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తరాలుగా కులవృత్తినే నమ్ముకొని కుండలు తయారు చేస్తున్నామని,ప్రస్తుతం ఆదరణ కరవైందని చెప్పారు.

గుజరాత్లో అనుసరిస్తున్న వృత్తి నైపుణ్యాలు, అధునాతన పరికరాలను తెలంగాణలో కూడా అందించి వృత్తిని నమ్ముకున్న మమ్మల్ని  ప్రోత్సహించాలని కోరారు.

ఇట్టి కార్యక్రమం లో గుగ్గిళ్ళ గంగరాజాం,మామిడిపెల్లి శ్రీనివాస్,ఎదులపురం శంకర్, మామిడిపల్లి నాగరాజ్,గుగ్గిళ్ళ వెంకటి,శనిగరపు రాకేష్,మరిపెళ్లి శ్రీనివాస్, ధూంపేట మహేష్,రాఘవపేట్ రాజేందర్,ఎదులపురం మల్లయ్య,మండల శాలివాన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments