అది జాబ్ మేళా కాదు -బీఆర్ఎస్ మేళా-అడ్డి భోజారెడ్డి.
By
Rathnakar Darshanala
అది జాబ్ మేళా కాదు -బీఆర్ఎస్ మేళా-అడ్డి భోజారెడ్డి.
ఇచ్చోడలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిర్వహించిన జాబ్ మేళా పై విమర్శలు
ప్రభుత్వం ఉద్యోగాలివ్వడంలేదన్నది అవాస్తవమని వారికి తెలుసు
స్థానిక ఎన్నికల్లో లబ్ది కోసమే అబద్ధాలు .
* యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వ బాధ్యత.
* బీజేపీ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు.
* గ్రామాల్లో కొరత పై రైతులు ఎంపీ ఎమ్మెల్యేను నిలదీయండి.
* కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో విపక్షాలపై విసుర్లు.
నేటి వార్త ఆదిలాబాద్ : ప్రభుత్వం ఉద్యోగాలివ్వడంలేదన్నది ముమ్మాటికి అవాస్తవమని అబద్ధాలు మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు.
సోమవారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ బీజేపీ లపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలిస్తే కాంగ్రెస్ సర్కార్ కేవలం 18 నెలల్లో 60వేల కు పైగా ఉద్యోగాలిచ్చిందని గుర్తు చేసారు.
ప్రైవేట్ లో కూడా ఇప్పటివరకు దాదాపు 2లక్షల 75 వేల ఉద్యోగాలిచ్చిందన్నారు.కేవలం రానున్న స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రజలెవరూ మీ మాటలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఎందుకంటే మీవెంట ఉంది నాయకులు కాని ప్రజలు కాదన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా 15ఏళ్లు పాలించిన జోగురామన్న స్వంత ఊర్లో ఒక్కరికన్నా ఇల్లు కట్టించిండా అని ప్రశ్నించారు.
కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చారు తప్పితే ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు.
తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 21వేల కోట్ల రుణ మాఫీ, తొమ్మిది రోజుల్లో 9వేల కోట్ల రైతుభరోసా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయణం, 500లకే గ్యాస్ సిలిండర్ , రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు.
మంచి గా పని చేస్తున్న ప్రభుత్వంపై అనవసర అబద్ధాలతో బురద చల్లాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో మీకు పుట్టగతులుండవన్నారు.
ఇక బీజేపీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో కేంద్రానికి ఎంత మాత్రం సంబంధం లేదన్నారు.
అటు యూరియా విషయంలోనూ
బీజేపీ నేతలు ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు.
గ్రామాల్లో యూరియా కొరత ఉంటే బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేను ఎందుకు సరఫరా చేయడం లేదని నిలదీయండని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ లు చెప్పే చిల్లర మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
అలాంటి పార్టీలకు స్థానిక ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.ఈ మీడియా సమావేశంలో నాయకులు గిమ్మసంతోష్
దేవిదాస్ చారి , సుధాకర్ గౌడ్, ఇర్పాన్ , పోతారెడ్డి, ఎంఏ షకీల్, రాజేశ్వర్ , అశోక్ ,రాంరెడ్డి,అజ్బత్. లతా, శ్రీలేఖ, సోనియా మంథని తదితరులు పాల్గొన్నారు.
Comments