దాతల ఆర్థిక సహాయంతో దహన సంస్కారం.

Rathnakar Darshanala
దాతల ఆర్థిక సహాయంతో దహన సంస్కారం.
నేటివార్త రాయికల్ జూలై 28:

రాయికల్ పట్టణంలోని కోరుట్ల క్రాస్ రోడ్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో అద్దెకు నివసిస్తున్న జాంగీర్ అనే వ్యక్తి, కుటుంబ సహితంగా నిస్సహాయంగా జీవనం సాగిస్తున్నాడు.

 ఆదివారం రోజు జాంగీర్ మృతి చెందగా,అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయం కోసం కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విషయం తెలిసిన జగిత్యాల వాసి జంగిలి కిషోర్,రాయికల్ కు చెందిన మున్ను మానవతా దృక్పథంతో స్పందించి రూ.4000 ఆర్థిక సహాయం అందజేశారు. వీరి సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
Comments