వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

Rathnakar Darshanala
వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
-జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 24 ఆడిచర్ల రమేష్

సీజనల్ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ ఆసుపత్రిని,పరిశీలించి నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు నిర్మాణం పూర్తి చేసుకున్న  తాత్కాలిక క్యాజువాలిటి ను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,ఆసుపత్రి వెనుక ఉన్న చిన్న సందు విస్తరించి అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా రిపోర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు.

ఈ తనీఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్,ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్,నర్సింగ్ సూపర్డెంట్ జమున సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments