అడ్డా కూలీల సమస్యలను పరిష్కరించాలి.
By
Rathnakar Darshanala
అడ్డా కూలీల సమస్యలను పరిష్కరించాలి.
- పెండింగ్ లో ఉన్న బెనిఫిట్స్ వెంటనే వచ్చేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి.
- ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్.
నేటివార్త, జూలై 24, బెల్లంపల్లి:
బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డెత్, మ్యారేజ్, డీలవరీ, ఫైల్ మీద ప్రభుత్వం నుంచిరావాల్సిన డబ్బులు అంధకా రెక్కడితే గాని డొక్కాడని నిరు పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,
అదేవిధంగా లేబర్ కార్డుల వల్ల కూలి పనిచేసుకొనే వారికి ఎన్నో బెనిఫిట్స్ వున్నాయని ఆ యొక్క బెనిఫిట్స్ కోసం ఏరోజు కూడ అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని అవగాహన సదస్సులు నిర్వహించి లేబర్ కార్డుల వల్ల వచ్చే లాభాలను ప్రజలకు తెలియజేశాల్సిన అవసరం ఎంతైనా ఉందని,
.
వెంటనే లేబర్ కార్డు మీద అవగాహన సదస్సులు, అదే విధంగా అడ్డాకూలీలకు వచ్చే బెనిఫిట్స్ ను వచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంసిపిఐయు పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హేచ్చరిస్తున్నాం అని అన్నారు.
Comments