కర్మాన్ఘాట్ ఆలయంలో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు.
By
Rathnakar Darshanala
కర్మాన్ఘాట్ ఆలయంలో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు.
నేటి వార్త జులై 27 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తన సతీమణి సరోజ వివేకానంద్ తో కలిసి ఆదివారం కర్మాన్ఘాట్ హనుమంతుడి దేవాలయానికి వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించారు.
ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికగా, పూజారులు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు.
తరువాత మంత్రిదంపతులు కర్మాన్ఘాట్ మైసమ్మ తల్లి ఆలయాన్ని దర్శించి, బోనాల జాతర సందర్భంగా సరోజ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు, సమృద్ధి కోసం మొక్కులు పెట్టారు.
ఈ సందర్బంగా స్థానికులు, మహిళా సంఘాల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మంత్రిదంపతులకు ఘన స్వాగతం పలికారు.
సాధారణ భక్తుల్లా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రివర్యులను అందరూ అభినందించారు.
కర్మాన్ఘాట్ దేవాలయంలో పూజలు చేసిన కార్మిక శాఖ మంత్రి వివేక్ దంపతులు బోనాల సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన సరోజ వివేక్ భక్తి శ్రద్ధలతో ఆలయాలను దర్శించిన మంత్రివర్యులు
Comments