సంధిపూడి గ్రామం లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ నిర్వహణ.
By
Rathnakar Darshanala
సంధిపూడి గ్రామం లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ నిర్వహణ.
సమగ్ర ఆరోగ్య ప్రచారం కార్యక్రమంలో.
పల్నాడు జిల్లా బ్యూరో జులై 23(నేటి వార్త)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ వారి యొక్క ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భాగమైన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి/ఎయిడ్స్ (దిశా) వారు ఈరోజు, పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సంధిపూడి గ్రామంలో 104 వైద్య బృందం యొక్క సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ (సమగ్ర ఆరోగ్య ప్రచారం కార్యక్రమం ) విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ ప్రచారంలో భాగంగా, సాధారణ ప్రజలకు మరియు వనరబుల్ జనాభాకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ మరియు హెపటైటిస్ బి& సి పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంపెయిన్ (సమగ్ర ఆరోగ్య ప్రచార కార్యక్రమం) లో డాక్టర్ ప్రభాకరావు గారు
హనుమంతరావు ఐసీటీసీ కౌన్సెలర్ చిలకలూరిపేట మరియు ఎమ్ ఎల్ హెచ్ ఎమ్ సుఖవేణి మరియు ఆశ వర్కర్స్ పాల్గొనడం జరిగింది.
ఈ సహకార ప్రయత్నం ముందస్తు గుర్తింపును ప్రోత్సహించడం, అవగాహన పెంచడం మరియు సమాజంలో ఆరోగ్య విస్తరణను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments