జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు పుట్టపాక నేతన్నల ఎంపిక.

Rathnakar Darshanala
జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు పుట్టపాక నేతన్నల ఎంపిక.
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన నేతన్నలకు చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం జాతీయ పురస్కారాలు ప్రకటించింది. 

ఈ ఏడాది మొత్తం 24 మందికి జాతీయ అవార్డులు వరించాయి. మొత్తం 24 అవార్డుల్లో 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులున్నాయి. 

వీరిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు చేనేతలు గూడ పవన్, గజం నర్మద ఎంపిక అయ్యారు. వీరికి ఆగస్టు 7న న్యూఢిల్లీలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

అయితే వీరిద్దరి స్వస్థలం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం కావడం గమనార్హం. 

కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కేంద్ర అవార్డుకు ఎంపికవడం పట్ల పుట్టపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ చేనేత అవార్డులు-2024కు ఎంపికైన ఇరువురికి తెలంగాణ రాష్ట్రంలోని పలు చేనేత సంఘాలు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు అభినందించారు.
Comments