కథ కంచికి చేరింది.
By
Rathnakar Darshanala
కథ కంచికి చేరింది.
ఎట్టకేలకు సీఐ ట్రాన్స్ఫర్.
ఇదంతా న్యాయవ్యవస్థలో పని చేస్తూన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని షికార్లు పుకార్లు..
నేటి వార్త (నూగురు వెంకటాపురం.)
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గత కొన్ని రోజులుగా హల్చల్ అవుతున్న పేకాట రాయుళ్లపై నమోదైన ఎఫ్ఐఆర్లకు,
కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రతి చర్యగా సిఐని ట్రాన్స్ఫర్ చేపించారని పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. అయితే అది ఏమాత్రం నిజం కాదని తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్న పేకాట రాయులే ఈ ఉదంతానికి పాల్పడ్డారు అని ఆరోపణలు కొంతమేర మండల ప్రజలను హడావిడి చేసినప్పటికీ,
సీఐ ట్రాన్స్ఫర్ ఒక న్యాయ వ్యవస్థలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్న ఒక అడ్వకేట్ మూల కారకుడని ప్రస్తుతం కొత్తగా మండలంలో వైరల్ అవుతుంది.
మరి ఆ సీఐ సహజంగానే ట్రాన్స్ఫర్ అయ్యారా లేక, అడ్వకేట్ చేపించాడా అనే సమాచారం మాత్రం గోప్యంగానే ఉంది.
ఇదిలా ఉండగా మరోవైపు మండల ప్రజల్లో మాత్రం ఆయనపై ఏ నలేని ప్రశంసలు కురిపిస్తున్నారు. చేసిన సర్వీస్ కాలంలో సిఐ తనదైన శైలిలో ప్రజలలో మంచి పేరు సంపాదించి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో ప్రధమ భూమిక పోషించారని పలువురు వారి సేవలను కొనియాడుతున్నారు.
Comments