వెంకట్రావు పేటలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.

Rathnakar Darshanala
వెంకట్రావు పేటలో ఘనంగా  మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.

 నేటి వార్త వేములవాడ నియోజవర్గం ప్రతినిధి మల్లేశం గౌడ్. 

 భీమారం మండల కేంద్రంలో వెంకట్రావు పేట  గ్రామం లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ నాయకులు నిర్వహించినారు.
 
 రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన 'తారక’మంత్రం.. ఘనంగా జనహృదయ నేత కేటీఆర్ ఘనంగా జన్మదిన వేడుకలు
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కేటీఆర్‌ గారి ఓ ప్రత్యేక స్థానమని, మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలుసిసలు తెలంగాణ వాది ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా  BRS నాయకులు  దీపక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ మడమతిప్పని పోరాటం చేశారని తెలిపారు. 

2018లో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొంటూ ముందుకుసాగుతున్నారనీ తెలిపారు. 

ప్రతి ఏటా  *మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయయి నిరుపేదల అభ్యున్నతి కోసం వెచ్చించాలని కార్యకర్తలకు తరుచూ చెబుతూ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో.  బంగారు దీపక్ కాటిపెళ్లి మల్లారెడ్డి. సుధావేణి గంగాధర్. కాటిపల్లి మహేష్. గుడిసెల రాజు. గుడిసెల గంగాధర్. సిపిరిశెట్టి రాజన్న. గాజుల కొండయ్య. కానుగంటి రాజేశం. కొంక గంగాధర్. పోతరాజు శ్రీనివాస్. సురుకంటి భూమన్న. పంచాయతీ మల్లయ్య. తాటిపల్లి చిన్న రామన్న మరియు తదితరులు పాల్గొన్నారు
Comments