యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించనున్న తండ్రి కొడుకులు.

Rathnakar Darshanala
యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించనున్న తండ్రి కొడుకులు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.. 

"సే నో టు డ్రగ్స్"పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 26 ఆడిచర్ల రమేష్

యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్భ్రోస్  5642 మీ (18,150 అడుగుల) పర్వతాన్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన రామగిరి మండలం సెండనరీ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు అధిరోహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తెలిపారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష"సే నో టు డ్రగ్స్"పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,9వ తరగతి చదువుతున్న వివేకానంద రెడ్డి,అతని తండ్రి మహిపాల్ రెడ్డి జూలై 28 న యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్  ఎల్భ్రోస్ పర్వతారోహణకై బయల్దేరుతారని,

దాదాపు 10 రోజుల పాటు జరిగే ఈ ప్రయాణంలో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై సే నో టు డ్రగ్స్,అనే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్,తెలంగాణ రాష్ట్ర లోగో కలిగిన త్రివర్ణ పతాకం కలిగిన బ్యానర్ ని ప్రదర్శిస్తారని తెలిపారు.

విద్యార్థి వివాకానంద రెడ్డి తన తండ్రి లెంకల మహిపాల్ రెడ్డి ఇంటర్నేషనల్ మౌంట్ నియర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్,  మాజీ సైనికుడు అయినటువంటి వాళ్ల నాన్నగారి దగ్గరే శిక్షణ తీసుకోవడం జరిగింది,

తన తండ్రి ఆధ్వర్యంలోనే పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి పెద్దపెల్లి జిల్లాకు,తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments