వర్షాలతో సీజనల్ వ్యాధులు. జాగర్తలు తప్పనిసరి.

Rathnakar Darshanala
వర్షాలతో సీజనల్ వ్యాధులు. జాగర్తలు తప్పనిసరి.
అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.

అంటు వ్యాధులు నియంత్రణలో అన్ని శాఖలు పనిచేయాలి.

దోమలు, ఈగలు వ్యాప్తిని అరికట్టాలి.

మురుగునీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిసర ప్రాంతాలు, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచాలి.


మేడ్చల్ జిల్లా, మేడిపల్లి జూలై 26, నేటి వార్త 

మేడిపల్లి మండలం పరిధిలోని  జంట కార్పొరేషన్లలో, వర్షాకాలం వచ్చిందంటేనే అంటువ్యాధుల ప్రభావం అధికమవుతుంది గత వారం రోజులుగా రాష్ట్రంలో ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు మరింత త్వరగా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది,

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే ప్రమాదం అధికంగా ఉంటుంది. నిల్వ ఉండే నీరు, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత, దోమలు, ఈగలు, కీటకాలు, పందులు, తదితర జంతువుల ద్వారా టైఫాయిడ్, కలరా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, విష జ్వరాలు, ఫైలేరియా, విరోచనాలు, 

తదితర అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే ఫుట్ పాత్ లపై విక్రయించే చిరుతిండ్లు పానీ పూరితో, అంటువ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అంటువ్యాధులు అరికట్టేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని సంబంధిత శాఖల సమన్వయంతో సమీక్ష సమావేశాలు నిర్వహించి 

అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నేటి వార్త మేడిపల్లి బ్యూరో.
Comments