మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న హైడ్రా..

Rathnakar Darshanala
మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న హైడ్రా.. 

   చెరువులకు చేటు. నా నాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం.

 హద్దులు నిర్ణయంలో జాప్యం.

 నీటిపారుదల శాఖ రెవిన్యూ శాఖ లో  మారని తీరు.

 జిల్లాలోనూ మండలం ల్లోనూ హైడ్రా తరహ వ్యవస్థ ఉండాలనీ డిమాండ్.

నేటి వార్త మల్యాల, ప్రతి నిధి.

దొనకొండ రమేష్.

 భూముల ధరలు భారీగా పెరుగుతుండడంతో చెరువుల కుంటలపై అక్రమ ఆధారులు చెరువులపై కుంటల పై పడ్డారు. నీటి వనరులను వదలడం లేదు.  గజాల చొప్పున కబ్జాకు పాలు పడుతున్నారు. అన్ని వర్గాలకు చెందిన కుంటలు చెరువులు పరి రక్షణ పట్టించుకోవడం లేదు. 

నీటిపారుదల శాఖ  రెవెన్యూ శాఖ పురపాలక శాఖ గ్రామ శాఖ దృష్టి సాధించడం లేదు. హైదరాబాద్ వరంగల్. నగరాలలో చెరువులు మాయమవగా  వాటి పేర్లు మిగిలి వున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా పరిరక్షణ చేపట్టకపోతే భవిష్యత్తులో పేర్లు మాత్రమే మిగిలే   ప్రమాదం ఉందని పలువురు పరిశీలకులు చెబుతున్నారు.

 మల్యాల, కొండగట్టు, తక్కల్లపల్లి, రాజారాం, మ్యాడం పల్లి, మానాల.
 
మల్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో మండల కేంద్రంలోని మార్కండేయ గుడిని నుండి కొండగట్టు వెళ్లే రహదారిని అనుకోని ఉన్న మల్యాల పరిహాక ప్రాంతంలో   చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  హైడ్రా ను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు  చేష్టలు  ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను  మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మండల కేంద్రాల్లో గ్రామాల్లో కబ్జాల గురై అధికారులు చూసి చూడనట్టుగా చెరువుల హద్దులు. 

చెరువు ప్రాంతం పరిహార రైతులు పంట పొలాలకు నీరు అందకపోవడం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని  అధికారులు చెరువుల రక్షణ తీసుకొని ప్రజలకు రైతులకు ఉపయోగపడేలా ఉపయోగపడేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 చెరువుల కుంటల సర్వే నెంబర్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మార్పులు జరుగుతున్నాయి.

 రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ సరిహద్దులు గుర్తింపు ప్రారంభించలేదు. జిల్లాలోనూ మండలాల్లోనూ హైడ్రో తరహా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది.

 ప్రధానంగా మండలంలోని అర్బన్ లోను ప్రాంతం భూమిలలో భూమి ధరలు భారీగా ఉన్నచోట చెరువులు కబ్జాకు గురవుతున్నాయి.
 
చెరువులలో తవ్వకాలు చేపడుతుంటే పూర్తిగా ఆక్రమణ పాలైనవి. మండలంలోని  చెరువులు 60% కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వీటిని ఈ ప్రభుత్వం కాపాడాలని చూస్తున్నారు.

మల్యాల ముత్యంపేట మార్కండేయచెరువు- ఇప్పటికే కొంత భాగం ఆక్రమించి కట్టడాలు కట్టారు. ఇదేవిధంగా జిల్లాలో మండలంలో కొండగట్టు ప్రాంతంలో ముత్యంపేట రహదారికి అనుకొని ఉన్న చెరువులో ను ఆక్రమణలు  చోటు చేసుకుంటున్నాయి.
Comments