ఉరి వేసుకొని యువతి మృతి.
By
Rathnakar Darshanala
ఉరి వేసుకొని యువతి మృతి.
నేటి వార్త జూలై 26, తాండూర్:
తాండూర్ మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జల గ్రామంలో ఉరివేసుకొని ఆత్రం వెంకటలక్ష్మి (16) అనే యువతి మృతి చెందినట్లు ఎస్ఐ సౌజన్య తెలిపారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆత్రం వెంకటలక్ష్మి నెల రోజుల నుండి మతిస్థిమితంతో బాధపడుతూ ఉండేదని పదో తరగతి పూర్తి చేసిన తర్వాత కొమరంభీం జిల్లాలో ఇంటర్మీడియట్ కోసం హాస్టల్ లో ఉండడం జరిగిందని తెలిపారు.
కొద్ది రోజుల కిందట హాస్టల్ నుంచి తీసుకోచ్చి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి వద్దనే ఉంచుకోవడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో లక్ష్మి మతిస్థిమితం లేక శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు.
యువతీ తండ్రి చందన్ షా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.
Comments