కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం.

Rathnakar Darshanala
కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 26 ఆడిచర్ల రమేష్.

సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఐ.పీ.ఎస్. పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారత విశ్రాంత మాజీ సైనికులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ,1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ దళాలను ఓడించి, పరుగులు పెట్టించి కార్గిల్ లోని ఎత్తైన స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకున్న భారత సైన్యం అసమాన ధైర్యాన్ని,త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26వ తేదీని"కార్గిల్ విజయ్ దివస్"గా దేశమంతా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.

దేశ రక్షణ కోసం అహర్నిశలు,అంకిత భావంతో కృషి చేస్తున్న భారత వీర సైనికుల త్యాగాలకు సంఘీభావం తెలుపుతూ,విశ్రాంత మాజీ సైనికులు జూపల్లి దామోదర్ రావు,వేములవాడ నారాయణ, పిట్టల వెంకటస్వామి,గుర్రం సదానందం గౌడ్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం మాజీ సైనికులు మాట్లాడుతూ,లయన్స్ క్లబ్ తమ సేవలను గుర్తించి సన్మానించినందుకు సంతోషిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు, జోన్ చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా హంగర్ రిలీఫ్ కో-ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, క్లబ్ ఉపాధ్యక్షులు పూసాల సాంబమూర్తి, కన్న రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.
Comments