ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు మా ఉద్యమం ఆగదు-గోపిడి శ్రీనివాస్ రెడ్డి.

Rathnakar Darshanala
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు మా ఉద్యమం ఆగదు-గోపిడి శ్రీనివాస్ రెడ్డి.
* బిజెపి మల్లాపూర్ మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి

• కమిటీ వేసినామని ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు

• ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు -

మల్లాపూర్ జులై20 (నేటి వార్త దిన పత్రిక) 

మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని ఆదివారం రోజున గోపిడి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సోమన్న గుట్ట నుండి ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేశారు.

గోపిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది.

కమిటీ వేసినామని కాలయాపన చేస్తూ మల్లాపూర్ మండల రైతులను చుట్టుపక్కల రైతులకు ఇబ్బందికరంగా మారిందని ఆరోపించారు గత ప్రభుత్వం కూడా మీలాంటి తప్పులే చేసింది వచ్చే ఎలక్షన్లు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేయడం జరిగింది.

రైతులు తలుచుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తారు ఇకనైనా మేల్కొని. మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని  విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు.బిజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘు, 

పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,చెరుకు రైతు ఉత్పత్తిదారి సంఘం అధ్యక్షులు నారాయణరెడ్డి,రైతు ఐక్య మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బైన ప్రశాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు పందిరి నాగరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి,బిజెపి కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments