ఆదివాసుల హక్కుల పరిరక్షణే ముఖ్యమంత్రి అభిమతం----ఎమ్మెల్సీ దండే విటల్.

Rathnakar Darshanala
ఆదివాసుల హక్కుల పరిరక్షణే ముఖ్యమంత్రి అభిమతం----ఎమ్మెల్సీ దండే విటల్.
 
నేటి వార్త జూలై 23 కాగజ్ నగర్: 

ఆదివాసుల హక్కుల పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ అభిమతమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు. 

    బుధవారం కాగజ్నగర్ పట్టణంలోనీ ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు ల కృషి వల్లే జీవో నెంబర్ 49 రద్దయిందన్నారు.

 వాస్తవానికి టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ప్రతిపాదనలకు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బీజం పడిందన్నారు. దానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రస్తుత జీవో విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 

గత స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ప్రోద్బలం వల్లనే టైగర్ కన్జర్వేషన్ పురుడు పోసుకుందన్నారు. టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ప్రతిపాదనల జరిపిన సమావేశంలో అప్పటి టిఆర్ఎస్ నాయకుల ఆమోద సంతకాలు ఉన్నట్లు తమవద్ద సాక్షాదారాలున్నాయన్నారు. 

అప్పటి సీఎం చంద్రశేఖర రావు చలవతోనే జీవో నెంబర్ 49కి బీజం పడిందన్నారు. ఆదివాసుల హక్కులను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ జీవో రద్దుకు కృషి చేశారన్నారు. 

టిఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం లోని ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతలు, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, చనక కోరాట, సాగునీటి పథకాలు అటకెక్కాయి అన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని జోడేఘాట్  అభివృద్ధి కి నోచుకోలేదని ఆయన అన్నారు. 

ఆదివాసి, ప్రజల ఆకాంక్షల మేరకే జీవో 49 నిలిచిపోయింది అన్నారు. స్థానికంగా ధర్నాలు చేసే సిర్పూర్ ఎమ్మెల్యే కేంద్రంలోని తన బిజెపి యంత్రాంగంపై జీవో నెంబర్ 49 సంపూర్ణ రద్దు కోసం ఒత్తిడి తీసుకురావాలన్నారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిత బిల్లును కేంద్రానికి పంపిస్తే కేంద్రం దాన్ని నిలిపివేసింది అన్నారు. రాష్ట్రంలోని పోడు రైతుల కష్టాలు టిఆర్ఎస్ హయాంలోనే వేళ్ళు నూకొన్నాయన్నారు. 

కెసిఆర్ హయాంలో వందలాది ఎకరాల పోడు భూములను అటవీ అధికారులు స్వాధీనపరచుకొని వాటిలో ప్లాంటేషన్ పేరిట మొక్కలు నాటారన్నారు. 

పోడు రైతుల సంక్షేమ దృష్ట్యా తమ ప్రభుత్వం అటవీ అధికారుల సమన్వయంతో ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొంటామని ఆయన అన్నారు. గత టిఆర్ఎస్ హయాంలో సిర్పూర్ తాలూకాలో దౌర్జన్యాలు తప్ప మరేది అభివృద్ధి లేదన్నారు.

 సిర్పూర్ లో నిర్మించిన మూడున్నర వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాలు సజావుగా సాగుతున్నాయన్నారు. 

జీవో నెంబర్ 49 శాశ్వత రద్దుకై పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చదువు రాని చవటల్లా వ్యవహరిస్తున్నారన్నారు. 

అంతర్జాతీయ టైగర్ జోన్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకు వచ్చిందన్నారు. ఫలితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తలోగ్గి టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు బీజం వేసింది అన్నారు. 

జీవో నెంబర్ 49 రద్దు కోసం నిరాహార దీక్షలు చేపడుతానని ప్రగల్బాలు లు  పలికిన సిర్పూర్ ఎమ్మెల్యే అలాంటి దీక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం ఎదుట చేపట్టాలన్నారు. నిరాహార దీక్షల పేరిట ఎమ్మెల్యే పాల్వాయి ఆదివాసులను తప్పుదోవ పట్టించి వారిని జైలుకు పంపే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. 

టిఆర్ఎస్ హయాంలో  రాక్షస పాలన సాగిందని,కాంగ్రెస్ హయాంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా కొన సాగుతుందని అన్నారు. 

జన్నారం అడవుల్లో మచ్చుకైన పులి లేకపోగా మానవులపై మమత కొరవడి క్రూర పులులపై కేంద్ర ప్రభుత్వం ప్రేమలు పెంచుకుంటుందన్నారు.

గత టిఆర్ఎస్ ప్రభుత్వ చొరవతోనే ప్రస్తుత జీవో నెంబర్ 49 శ్రీకారం చుట్టుకొందని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

 టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ టిఆర్ఎస్ హయంలో బీజం పడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అన్నారు. చెరిపేస్తే చరిత్ర కనుమరుగు కాదన్నారు. టైగర్ కన్జర్వేషన్ కారిడార్ కోసం నేషనల్ టైగర్ అథారిటీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపింది ఎవరని ప్రశ్నించారు.

 జీవో పూర్తి రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అలా జరిగిన పక్షంలో ప్రస్తుత సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా అని ఆయన ప్రశ్నించారు.

విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ సిడం గణపతి, మాజీ ఎంపీ గజ్జిరామయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గులాం దస్తగిరి, బాజీ మున్సిపల్ కౌన్సిలర్లు షబ్బీర్ అలీ, శరత్ ముదిరాజ్, కలికోట రమణయ్య, 

మాజీ జెడ్పిటిసి ఎన్ రామారావు, దుబ్బుల నానయ్య, రాణా ప్రతాప్ సింగ్, కోడప విశ్వేశ్వర్, సంజయ్ సింగ్, విష్ణువర్ధన్, యూసుఫ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments