కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే.

Rathnakar Darshanala
కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే.
-బిసి రిజర్వేషన్ల పేరుతో కపట నాటకం..
-కాంగ్రెస్,బిఆర్ఎసును వీడి బిజెపిలో చేరిన నేతలు..
-బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 23 ఆడిచర్ల రమేష్

బిసి రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కపట నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని బిజెపి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. 

పెద్దకల్వలకు చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు పయ్యావుల శ్రీనివాస్,మానుక శ్రీనివాసుతో పాటు పలువురు నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆద్వర్యంలో బిజెపిలో చేరారు. 
కాషాయ కండువాకప్పిన గుజ్జుల వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. 

మంత్రులు,ఎమ్మెల్యేలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని, గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వారికి నెలకొందని ఎద్దేవా చేశారు. 

ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లేనేని, కాంగ్రేసు నాయకులు ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని గుజ్జుల స్పష్టం చేశారు.

పెద్దపల్లిలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో అత్యధిక ఎంపిటీసి,జడ్పిటీసీ, కౌన్సిలర్లను గెలిపించుకొని తమ సత్తా చాటుతామని,కార్యకర్తలకు అండగా ఉండి విజయతీరాలకు చేరుస్తానని గుజ్జుల కార్యకర్తలకు భరోస కల్పించారు.

రాబోయే స్థానిక,మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించబోతోందని,బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. 

అనంతరం పార్టీలో చేరిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ,దేశంకోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ విధానాలతో ప్రభావితమయ్యమని పేర్కొన్న ఆయన,భవిశ్యత్తులో దేశంకోసం, ధర్మంకొసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలకు చెందిన పెగడ మల్లేష్, భూషనవేన శ్రీనివాస్,నాంసాని రాజ్ కుమార్,బొల్లం అంజయ్య, నెత్తెట్ల రాజు,బత్తుల రాజకుమార్, అరికే అరవింద్,తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పర్స సమ్మయ్య, పల్లె సదానందం, పర్శ శంకర్, ఒడ్నాల లక్ష్మయ్య, నాంసాని తిరుపతి, పయ్యావుల సమ్మయ్య,నాంసాని రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments