పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన పీఆర్టీయూ టీఎస్ సభ్యులు.

Rathnakar Darshanala
పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన పీఆర్టీయూ టీఎస్ సభ్యులు.
 నేటి వార్త వేములవాడ నియోజవర్గం ప్రతినిధి మల్లేశం గౌడ్. 

 జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో  దమ్మన్నపేట గ్రామంలో ఉద్యోగ విరామ సన్మాన కార్యక్రమం.

బీఈడీ అర్హత కలిగిన ఎస్జిటి ఉపాధ్యాయులకు ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం లు గా పదోన్నతులు కల్పించాలి   పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యా జిల్లా శాఖ   ఎన్ సి 

టి ఈ నిబంధనలు 2010 నుండి అమలయ్యాయి కాబట్టి 2010 ముందు బిఈడి అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పోస్టులకు 

జీవో నెంబర్ 11, 12 లను సవరించి అవకాశం కల్పించాలని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు యాల్ల అమర్నాథ్ రెడ్డి, కోరారు 

మేడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట లో పనిచేస్తున్న ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ మురళి కృష్ణ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ,

 మిగిలిపోయిన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 650 పండిత్ మరియు పి ఈ టి పోస్టులను అప్గ్రేడ్ చేసి ఈ పదోన్నతులలో అవకాశం కల్పించాలని వారు కోరారు ఈ విషయాలపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి  పి ఆర్ టి యు టి ఎస్ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి,

ముఖ్యమంత్రి  ప్రాతినిధ్యం చేయడం జరిగింది అని వారన్నారు ఈ సందర్భంగా మురళీకృష్ణ, సేవలను కొనియాడారు అనంతరం మురళి కృష్ణ,ని ఘనంగా సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలిత మండల విద్యాధికారి లక్ష్మీ నరసయ్య,మాజీ ఎంపీటీసీ సభ్యులు రమేష్ రెడ్డి,మాజీ సర్పంచ్ సురేష్,మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లేశం,రాజేందర్, గంగాధర్,భాస్కర్,చంద్ర ప్రకాష్ రెడ్డి,రాజేందర్, రెడ్డి పెద్ది రాజు, రాజేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు
Comments