కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం---ఎమ్మెల్సీ దండే విటల్.
By
Rathnakar Darshanala
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం---ఎమ్మెల్సీ దండే విటల్.
నేటి వార్త జూలై 29 కాగజ్ నగర్:
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,
తీర్యాణి మండల కేంద్రంలో 3.25 కోట్ల నిధులతో నిర్మించనున్న బాలుర వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ జరిపి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థలో మౌలిక వసతులు ఏర్పాటు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తీర్యాణి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
వర్షాకాలం పూర్తి కాగానే వసతి గృహ నిర్మాణ కార్యక్రమాల్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు,
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జువ్వాడి అనిల్ గౌడ్, ఎంపీడీవో వేముల మల్లేష్, ఎంఈఓ అంజయ్య, మండల అధికారులు, తాజా మాజీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments