తాండూర్ లో ఘనంగా పంచమి.
By
Rathnakar Darshanala
తాండూర్ లో ఘనంగా పంచమి.
నేటివార్త,జూలై 29, తాండూర్:
శ్రావణమాసం నాగ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
మహిళలు పుణ్య స్థానాలు ఆచరించి మంగళవారం ఉదయమే ఆలయాలకు చేరుకొని పూజలు చేశారు.నాగదేవతకు,పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.తాండూర్ మండలం బోయపల్లి లోని హనుమాన్ ఆలయంలో, మాదారం పోలిస్టేషన్ మైదానంలోని పుట్ట వద్ద భక్తులతో సందడి నెలకొంది.
తాండూర్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న పుట్ట వద్ద నాగదేవతకు పాలు పోసి పూజలు చేశారు. నాగ పంచమి పురస్కరించుకొని హనుమాన్ ఆలయానికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.ఆలయంలోని గర్భగుడిలో మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు.
Comments