భాస్కర్ గౌడ్ ఆద్వర్యం లో కేటీఆర్ సేన జిల్లెల్ల గ్రామ కమిటీ ఏర్పాటు.

Rathnakar Darshanala
భాస్కర్ గౌడ్ ఆద్వర్యం లో కేటీఆర్ సేన జిల్లెల్ల గ్రామ కమిటీ ఏర్పాటు.
- కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులుగా పొన్నం పృధ్వి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయినది.

నేటి వార్త న్యూస్, జూలై  27 : 

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామం లో కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులుగా పొన్నం పృధ్వీ ని మండల కమిటీ ఆద్వర్యం లో ఎన్నుకొన్నారు ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన కేటీఆర్ సేన నీ బలోపేతం చేస్తాం అన్నారు.

అదే విధంగా రానున్న రోజుల్లో ఊరూరా పార్టీ నీ బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన ఇపుడు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపైన ప్రజల్లోకి తీసుకెళ్లి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను ఆగం చేస్తున్న ఈ ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతామన్నారు.

 రానున్న రోజుల్లో భవిషత్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు తౌటు శివ కృష్ణ, మామిడిల విజయ్, మామిడాల ఉమాశంకర్ జిల్లెళ్ళ మాజీ సర్పంచ్ మాట్ల మధు, 

ఉప సర్పంచ్ సతీష్ రెడ్డి, మాజీ మండల్ కో ఆప్షన్ మెంబర్ తాజొద్దీన్, బిఆర్ఎస్ నాయకులు బొల్గం సతీష్ జిల్లెళ్ల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి ఉప అధ్యక్షులు ఎర్ర సుమన్ బిఆర్ఎస్ 

నాయకులు బండి శ్రీను, ప్రవీణ్, పవన్,రాకేష్, నాగరాజు, గీసా పర్శరాములు, తాళ్ళపెళ్లి రాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments